Vice President Election: ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎంపీలు పార్లమెంట్‌కు క్యూ కట్టారు. ప్రధాని మోదీ.. సహా ఎంపీలు అంతా తమ ఓటును వినియోగించుకున్నారు. సభలో 8 ఖాళీ స్థానాలు సహా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
Vice President Election: భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎంపీలు పార్లమెంట్‌కు క్యూ కట్టారు. ప్రధాని మోదీ.. సహా ఎంపీలు అంతా తమ ఓటును వినియోగించుకున్నారు. సభలో 8 ఖాళీ స్థానాలు సహా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ధన్ ఖడ్ గెలుపు నల్లేరు మీద నడకగానే కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. కేవలం ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉండటంతో.. ఎన్డీఏ అభ్యర్థి విజయం లాంచనంగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం 780 మంది సభ్యులు ఉండగా.. గెలుపొందే అభ్యర్థికి 373 ఓట్లు కావాలి. ఒక్క బీజేపీకే లోక్ సభలో 303, రాజ్యసభలో 91 మంది ఎంపీల బలంతో కలిపి 394 ఓట్లు ఉన్నాయి. దానికి తోడు మిత్ర పక్షాలు సపోర్ట్ చేయడంతో.. దన్కడ్ కు మెజారిటీ పెరిగే అవకాశం ఉంది.
లోక్ సభలో 543 మంది, రాజ్య సభలో 245 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్ము కాశ్మీర్ నుంచి నలుగురు, త్రిపుర నుంచి ఒకరు, నామినేటెడ్ సభ్యుల నుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంతే కాకుండా తృణముల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో.. 44 ఓట్లు తగ్గాయి. 744 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉండటంతో.. కొత్తగా నామినేట్ అయిన 12 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకున్నారు.