Last Updated:

PM Modi: కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

PM Modi: ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. తన ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ భోపాల్ లో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు.

PM Modi: కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

PM Modi: ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. తన ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ భోపాల్ లో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ప్రజలారా వినండీ అంటూ తనదైన శైలిలో ప్రసంగించిన మోదీ మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం బాగుండాలంటే బీజేపీకి ఓటేయండీ..కేసీఆర్ కుటుంబం బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి’’అంటూ వ్యాఖ్యానించారు.

విరుచుకుపడిన మోదీ(PM Modi)

ఇలా మొట్టమొదటిసారి ప్రధాని మోదీ స్వయంగా సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయటం దేశ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు తెరతీస్తాయనే చెప్పాలి. ఎందుకంటే మోదీ మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా బహిరంగంగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్ ను ఓడించాలనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

అలాగే ఈరోజు ప్రధాని మోదీ మరో 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జబల్ పుర్ కు వెళ్లే రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. మిలిగిన మూడు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. మడ్ గావ్ నుంచి ముంబై, ధార్వాడ నుంచి బెంగళూరు, హతియా నుంచి పాట్నాకు వెళ్లే మూడు రైళ్లను ప్రధాని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.