Home / జాతీయం
Karnataka Home Minister G.Parameshwara Apologizes to Women: పెద్దనగరాల్లో లైంగిక వేధింపులు సాధారణం అంటూ కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై పరమేశ్వర దిద్దుబాటు చర్యలకు దిగారు. తన మాటలకు మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. తప్పుగా అర్థం చేసుకున్నారు.. తాను చేసిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని హోంమంత్రి తెలిపారు. తాను […]
Electronic surveillance system for India Boarders said by Union Home Minister Amit Shah: దేశ సరిహద్దుల్లో చొరబాట్లను నివారించేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట, భూగర్భ సొరంగాలను గుర్తించి ధ్వంసం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. జమ్మూకశ్మీర్ హీరానగర్ సెక్టార్‌లోని బీఎస్ఎఫ్ […]
Indigo Flight Emergency Landing due to Women Death: ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు మృతిచెందింది. ఈ సంఘటన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌లో జరిగింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం ఇండిగో ఎయిలైన్స్ విమానం ప్రయాణికులతో మహారాష్ట్ర నుంచి వారణాసికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఓ ప్రయాణికురాలు (89) అస్వస్థతకు గురైంది. ఆమె పరిస్థితి గమనించిన తోటి ప్రయాణికులు సిబ్బందికి విషయం తెలియజేశారు. అప్రమత్తమైన […]
Rs 50 Hiked on Gas cylinder: దేశంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కాసేపటికే వంట గ్యాస్ ధరలు పెంచింది. వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు సైతం ఈ పెంపు వర్తించనుందని కేంద్రం స్పష్టం చేసింది. ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 50 పెంచగా.. ఈ ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు […]
Central Government Hiked excise duty on Petro and Diesel Prices for Rs 2 Only: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లీటర్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ పెరగనుంది. పెంచిన ఈ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, పెట్రో ధరల పెంపుదలపై కేంద్రం మరో వివరణ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ […]
Jagjit Singh Dallewal : దేశంలోని రైతన్నల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీతోపాటు పలు డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు గతేడాది నవంబర్ 26వ తేదీన దీక్ష చేపట్టారు. దీక్షను విరమించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రణ్‌వీత్‌సింగ్ బిట్టు విజ్ఞప్తి చేయగా, మరుసటి రోజు ఆయన […]
Maharashtra Heart Attack : వయసుతో ఎలాంటి సంబంధం లేకుండానే గుండెపోటుతో పలువురు చనిపోతున్న ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. తాజాగా ఓ కళాశాల ప్రోగ్రామ్‌లో విద్యార్థిని మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలోని ఓ కళాశాల యాజమాన్యం ఇటీవల వీడ్కోలు పార్టీ నిర్వహించింది. వీడ్కోలు పార్టీలో పాల్గొన్న 20 ఏళ్ల విద్యార్థిని వేదికపై మాట్లాడుతోంది. కళాశాలలో తన అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. తన మాటలతో […]
MK Stalin : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి స్టాలిన్ హాజరుకాకపోవడం గమనార్హం. డీలిమిటేషన్‌ను అమలు చేయాలని డిమాండ్.. తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించగా, అదేసమయంలో మరోచోట జరిగిన కార్యక్రమంలో […]
MA Baby : సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఆదివారం తమిళనాడు రాష్ట్రం మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ను కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారాం ఏచూరి మృతి చెందగా, ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దీంతో పార్టీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారాట్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 85 మందితో కేంద్ర కమిటీ.. మదురైలో జరిగిన సీపీఎం […]
Pamban Bridge : భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెనను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది. సముద్రంలో 2.08 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద భాగాన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీనిని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని […]