Home / జాతీయం
Mamata Banerjee : 8 రోజుల మిషన్ కోసం అని వెళ్లి దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్రజలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యోమగాములను అభినందిస్తున్నారు. […]
Union Minister Nityanand Rai nephew dead by brother gun fire: బీహార్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని భాగల్పూరు వద్ద కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మేనల్లుడు మృతి చెందాడు. నీటి వివాదం సోదరుల మధ్య కాల్పులు జరిగాయి. సోదరుడి కాల్పుల్లో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మేనల్లుడు విశ్వజీత్ చనిపోగా.. మరో మేనల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బీహార్‌లోని భాగల్పుర్ సమీపంలోని జగత్పూర్ గ్రామంలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ […]
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు ఎదురెదురుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గంగలూరు పరిధి ఆండ్రి అడవుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టుు మరణించగా.. ఓ జవాన్ కూడ […]
CM Chandrababu Meeting With Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై బిల్ గేట్స్ పోస్టు చేశారు. రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్యంలో పాటు వ్యవసాయం, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎదురుచూస్తున్నట్లు వివరించారు. కాగా, అంతకుముందు రోజు ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపీ సీఎం […]
Meerut Murder Case: యూపీలోని మీరట్‌లో గుండెలు పిండేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడితో కలిసి భర్తను ఓ భార్య దారుణంగా హత మార్చింది. హత్య అనంతరం నిందితులిద్దరూ మృతదేహాన్ని ముక్కలుగా నరికి. ఆ తర్వాత డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సీల్ చేశారు. ఇప్పుడు ఈ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసును పోలీసులు వెల్లడించారు. కుట్రదారుడు మరెవరో కాదని, సౌరభ్ […]
Election Commission : ఈసీ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్‌తో ఓటర్ కార్డు అనుసంధానం ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. మంగళవారం పలుశాఖల ముఖ్య కార్యదర్శులతో ఎన్నికల కమిషన్ సమావేశమైంది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను అత్యంత వేగంగా జరపాలని నిర్ణయించింది. దీంతో దొంగ ఓట్లను పూర్తిగా నివారించొచ్చని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఆధార్ కార్డుతోపాటు ఓటరు ఐడీ అనుసంధానం అయితేనే ఓటింగ్‌కు […]
PM Modi : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. భారత్‌ను సందర్శించాలని ఆయన ఆ లేఖలో సునీతాను కోరారు. సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా ఇవాళ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి తిరుగు ప్రయాణమైంది. ఆస్ట్రోనాట్ సునీతాతో పాటు విల్మోర్ మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమి మీదకు వస్తున్నారు. మార్చి 1వ తేదీన సునీతకు ప్రధాని మోదీ లేఖ రాసినట్లు కేంద్ర […]
Railways Cancellation Ticekt Money will be Refunded within Three Days: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో రద్దయిన రైళ్లకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణికులకు మూడు రోజుల్లోగా వాపస్ చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. అయితే కౌంటర్లో తీసుకున్న టికెట్‌కు సంబంధించి మూడు రోజుల్లోగా సంబంధిత రైల్వే స్టేషన్లో ఇచ్చి డబ్బులు పొందవచ్చని సూచించింది. సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు టికెట్ డబ్బుల […]
PM Modi Says India and New Zealand to Institutionalise Defence and Security Cooperation: న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఐదు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలకు ముందుకు తీసుకెళ్లాలనే ప్రధాన లక్ష్యంతో ఇరు దేశాల ప్రధానులు పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానంగా రక్షణ, భద్రత సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరు […]
Rajnath Singh : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో అగ్రరాజ్యం అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అధికారులు భేటీ అయ్యారు. సౌత్‌బ్లాక్‌లో ఈ మీటింగ్ జరిగింది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన సంబంధాల బలోపేతం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం కూడా చర్చల అజెండాలో ఉంది. ఓ రక్షణ ఒప్పందంపై చర్చలు జరిగినట్లు సమాచారం. భారత్‌లో రెండున్నర రోజుల పర్యటనకు తులసీ న్యూఢిల్లీకి వచ్చారు. గ్లోబల్ ఇంటెలిజెన్స్ కాంక్లేవ్‌లో […]