Home / జాతీయం
గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టిక్కెట్ లభించింది. ఆమె జామ్‌నగర్ నార్త్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు.
ఇటీవల కాలంలో వరుస భూకంపాలు ప్రపంచంలోని ఏదో ఒకదగ్గర ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు వెల్లడిస్తున్నారు. రిక్టర్‌స్కేలుపై 4.3గా భూకంప తీవ్రత నమోదయిందని పేర్కొంటున్నారు.
భీమా కోరెగావ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
1991 సంస్కరణలను "హాఫ్ బేక్డ్ " అంటూ కొన్ని వారాల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ బుధవారం విరుచుకుపడింది. "మాస్టర్ చెఫ్" నితిన్ గడ్కరీ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను పొగడటం ద్వారా దానిని పూర్తిగా తయారు చేసారని అంది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్ మరియు జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామంలో రోడ్డుకు గ్రామ పాఠశాలలో చదివి, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్ది పేరు పెట్టారు. న్యూజల్పాయ్ గురిలోని ఒక మారుమూల గ్రామమైన దోష్ దర్గాలో రాబోయే మూడు కిలోమీటర్ల రహదారికి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు దులాల్ దేబ్నాథ్ సోమవారం రోడ్డుకు శంకుస్థాపన చేసారు.
భారతదేశంలో టీవీ ఛానెళ్ల అప్‌లింక్ మరియు డౌన్‌లింక్ కోసం కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారాల కోసం పర్మిట్ హోల్డర్ల నుండి ముందస్తు అనుమతి అవసరం లేదు.