Home / జాతీయం
నేటి సమాజంలో పబ్ కల్చర్ శరవేగంగా విస్తరిస్తోంది. ఆడమగ వయసు వ్యత్యాసం లేకుండా తెగతాగేస్తున్నారు. తాగేసి గుట్టుచప్పుకుకాకుండా కొందరు ఉంటే మరికొందరు ఆ మైకంలో వారేం చేస్తున్నారో వారికే తెలియకుండా రోడ్డుపై నానా రచ్చ చేస్తుంటారు. ఈ కోవకు చెందినదే ఈ వీడియో మరి ఆ ఘటన ఏంటి ఎక్కడ జరిగిందో ఓ సారి చూసెయ్యండి.
భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్‌లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.
కర్ణాటకలోని చిక్కమగళూరులోని కొప్పాకు చెందిన ఔత్సాహిక ఉపాధ్యాయురాలు గత ఆదివారం జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అడ్మిషన్ టికెట్లో సన్నీ లియోన్ ఫోటో ఉండటంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది.
భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతున్న సమయంలో విషాదం చోటుచేసుకొనింది. 62వ రోజు పాదయాత్ర లో భాగంగా నాందేడ్ జిల్లా అట్కాలి గ్రామంలో జోడో యాత్ర సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సేవాదళ్ నేత కృష్ణ కుమార్ పాండే పాదయాత్రలో కుప్పకూలి మరణించారు.
పచ్చని పల్లెలు కనుమరుగౌతున్నాయి. నగరాలు శరవేగంగా పెరుగుతున్నాయి. పారిశ్రామీకరణ కారణంగా దేశంలోని చిన్న నగరాలను కాలుష్యం చిదిమేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాలుష్యం కోరల్లో చిక్కిందని పదే పదే వింటుంటాం. కాని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది.
నకిలీ కుల ధృవీకరణ పత్రం కేసులో లోక్‌సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రిపై కోర్టు సోమవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికల బాండ్ల పథకాన్ని సవరించింది. రాష్ట్రాలు మరియు శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభకు సాధారణ ఎన్నికల సంవత్సరంలో 15 అదనపు రోజుల పాటు వాటిని విక్రయించడానికి వీలు కల్పిస్తుంది.
జార్ఖండ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వారి సహచరులపై దాడి చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ రూ. 100 కోట్లకు పైగా లెక్కచూపని లావాదేవీలు మరియు పెట్టుబడులను గుర్తించింది.
రాజస్థాన్లోఒక ఉపాధ్యాయురాలు తాను ప్రేమించిన విద్యార్దినిని వివాహం చేసుకోవడానికి లింగ మార్పు శస్త్రచికిత్స చేయించుకున్నారు.
భాజపా భీష్ముడు, రామ జన్మభూమి కోసం రధయాత్రను చేపట్టిన కీలకధారి లాల్ కృష్ణ అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.