Last Updated:

Civils Prelims 2023: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Civils Prelims 2023: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

Civils Prelims 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం

 

14 వేల మంది ఉత్తీర్ణత(Civils Prelims 2023)

అఖిల భారత సర్వీసుల్లో అధికారులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది మే 28 న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించింది యూపీఎస్సీ. ఇందులో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఏడాది సెప్టెంబరు 15 న జరిగే మెయిన్స్‌ పరీక్షకు హాజరు అయ్యేందుకు అర్హత సాధించారు.

ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ వెల్లడించింది. దరఖాస్తుకు చివరి తేదీని యూనియన్ త్వరలోనే వెల్లడించనుంది.  సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రిలిమ్స్‌ కటాఫ్‌, ఆన్సర్‌ కీని ప్రకటించనున్నట్టు యూపీఎస్సీ వెల్లడించింది.