Last Updated:

BrahMos: ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థలను ఎగుమతి చేయనున్న భారత్

ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల గ్రౌండ్ సిస్టమ్‌లను ఎగుమతి చేయడానికి భారతదేశం సిద్ధమయింది. సిస్టమ్ యొక్క క్షిపణులు ఈ ఏడాది మార్చి నాటికి ఫిలిప్పీన్స్‌కు చేరుకుంటాయని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్   డాక్టర్ సమీర్ వి కామత్ వెల్లడించారు.

BrahMos: ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థలను ఎగుమతి చేయనున్న  భారత్

BrahMos: ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల గ్రౌండ్ సిస్టమ్‌లను ఎగుమతి చేయడానికి భారతదేశం సిద్ధమయింది. సిస్టమ్ యొక్క క్షిపణులు ఈ ఏడాది మార్చి నాటికి ఫిలిప్పీన్స్‌కు చేరుకుంటాయని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్   డాక్టర్ సమీర్ వి కామత్ వెల్లడించారు.

375 మిలియన్ డాలర్ల ఒప్పందం..(BrahMos)

బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల మొదటి సెట్ మార్చి చివరి నాటికి ఫిలిప్పీన్స్‌కు చేరుకుంటుందని ఆయన తెలిపారు.375 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం డీఆర్డీవో విదేశాలలో కుదుర్చుకున్న అతిపెద్ద రక్షణ ఒప్పందం కావడం విశేషం. LCA Mk-1A, Arjun Mk-1A, QRSAM, ఆకాష్ కోసం మరిన్ని స్క్వాడ్రన్‌లు తీసుకోబోతున్నాము. మా వ్యూహాత్మక క్షిపణులు చాలా త్వరలో ప్రవేశ పెట్టబోతున్నామని కామత్ చెప్పారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన సుమారు రూ. 4.94 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) లో చేర్చబడ్డాయి. రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే అవకాశముందని అన్నారు. అదేవిధంగా అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ హోవిట్జర్‌ల కోసం మెగా ఆర్డర్ ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఖరారు చేయబడుతుందని భావిస్తున్నారు.

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి డీఆర్డీవో, రష్యన్ ఫెడరేషన్ యొక్క NPO Mashinostroyeniya మధ్య జాయింట్ వెంచర్. ఇది ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన క్షిపణి కార్యక్రమాలలో ఒకటిగా చెప్పబడింది. ప్రపంచ స్థాయిలో అగ్రగామి మరియు వేగవంతమైన ఖచ్చితత్వ-గైడెడ్ ఆయుధంగా గుర్తించబడిన బ్రహ్మోస్ భారతదేశ నిరోధక సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.