Last Updated:

Manipur: మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వ్యక్తి ఇంటికి నిప్పు

మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు చూపుతున్న వీడియోపై దేశం ఆగ్రహంతో ఊగిపోతుండగా, ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ ఇంటిని గురువారం కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు.మే 3న ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన రెండు నెలల తర్వాత బయటపడింది.

Manipur: మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వ్యక్తి ఇంటికి నిప్పు

Manipur: మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు చూపుతున్న వీడియోపై దేశం ఆగ్రహంతో ఊగిపోతుండగా, ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ ఇంటిని గురువారం కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు.మే 3న ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన రెండు నెలల తర్వాత బయటపడింది. ఇంటర్నెట్ నిషేధం ఎత్తివేసిన తర్వాత వైరల్ అయింది.

ఈ వీడియోను గమనించాక మణిపూర్ పోలీసులు బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులపై తౌబాల్ జిల్లాలో కిడ్నాప్, సామూహిక అత్యాచారం మరియు హత్య కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.గురువారం, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మాట్లాడుతూ, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, వీలైతే ఉరిశిక్ష విధించాలని కోరుతామని చెప్పారు.మే 3న మణిపూర్‌లో జాతి హింస చెలరేగినప్పటి నుండి 150 మందికి పైగా మరణించగా పలువురు  గాయపడ్డారు.

స్పందించని మహిళా కమీషన్..(Manipur)

మణిపూర్‌లో మహిళలపై లైంగిక వేధింపుల సంఘటన పై జూన్‌లో జాతీయ మహిళా కమిషన్ (NCW)కి ఫిర్యాదు అందింది. ఇద్దరు కార్యకర్తలు మరియు నార్త్ అమెరికన్ మణిపూర్ ట్రైబల్ అసోసియేషన్  జాతీయ మహిళాకమీషన్ కు  ఫిర్యాదు చేయడానికి ముందు లైంగిక హింస నుండి బయటపడిన వారితో మాట్లాడారు. అయితే, మహిళా ప్యానెల్ నుంచి తమకు ఎలాంటి స్పందన రాలేదని వారు ఆరోపించారు. మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి సంఘర్షణ మరియు మానవతా సంక్షోభంపై మేము మీ తీవ్రమైన మరియు తక్షణ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాము. ప్రత్యేకంగా, మణిపూర్ సంఘర్షణలో కుకీ-జోమి గిరిజన మహిళలపై లైంగిక హింసను పరిష్కరించడానికి మరియు ఖండించాలని మేము జాతీయ మహిళాకమీషన్ కు అత్యవసర విజ్ఞప్తి చేస్తున్నామంటూ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగా కోపం ఉంటే ముందుగా ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ను బర్తరఫ్ చేసి ఉండేవారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు.శుక్రవారం పార్లమెంటులో మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేస్తారని భారతదేశం ఆశిస్తున్నదని మల్లికార్జున్ ఖర్గే ఒక ట్వీట్‌లో తెలిపారు.