Home / Manipur
Manipur attacking Army camp: మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11మంది సాయుధులు మృతిచెందారు. స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడులకు తెగబడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా కుకీ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు కొందరు గాయపడ్డారు. జకురాడోర్ కరోంగ్‌లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. […]
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్‌లను రాష్ట్రపతి నియమించారు. వీరి నియామకంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 కు చేరింది.
మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పవర్ స్టేషన్ నుంచి భారీ ఇంధనం లీకై దాని పక్కనే ప్రవహించే వాగుల్లో కలిసింది. కొన్ని చోట్ల వాగుల్లో మంటలు రేగడంతో స్దానికులు ఆందోళనకు గురయ్యారు. కాంటో సబల్, సెక్మాయి వంటి గ్రామాల మీదుగా వెళ్లే వాగుల్లో ఇంధనం కలిసిందని వారు తెలిపారు. దీనితో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో రెండు గ్రూపుల ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. అనంతరం అస్సాం రైఫిల్స్ ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించనపుడు తెంగ్నౌపాల్ జిల్లాలో వీరి మృతదేహాలను కనుగొన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది.
మణిపూర్ ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 5 వరకు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. హోం శాఖ మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని వారంలోపు రెండుసార్లు పొడిగించడం గమనార్హం.హానికరమైన సందేశాలు, ఫోటోలు మరియు వీడియోలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతి భద్రతలు మరియు హింసకు అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 26 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పోలీసులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మణిపూర్‌లో ఇద్దరు విద్యార్దుల మృతిపై హింసాత్మక నిరసనలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రదర్శనలలో భాగంగా ఇంఫాల్ వెస్ట్‌లో ఒక గుంపు రెండు నాలుగు చక్రాల వాహనాలను తగులబెట్టింది . అంతేకాదు డిప్యూటీ కమీషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది.
మణిపూర్ ప్రభుత్వం బుధవారం నాడు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) అక్టోబర్ 1 నుండి 6 నెలల పాటు పొడిగించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, లోయలోని 19 పోలీసు స్టేషన్లు మినహాయించబడ్డాయి.
మణిపూర్ లో జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు ఒక ప్రదేశంలో కూర్చున్నట్లు చూపించారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కనిపిస్తున్నాయి.
మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రతిపక్షాల నుంచి చర్చ ప్రారంభించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చను మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు.