Last Updated:

AAP MPs: సీఎం జైల్లో.. పార్టీ నేతలు విదేశాల్లో.. ఆప్ ఎంపీల తీరుపై సొంతపార్టీ నేతల విమర్శ

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టి ఊరు పేరు లేని వారికి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు... రాజ్యసభ సీట్లు అప్పగించారు. అయితే కష్ట కాలంలో వెన్నంటి ఉండాల్సిన సమయంలో తన పార్టీ సహచరులే ఇప్పడు ముఖం చాటేస్తున్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆమ్‌ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా మొదటివరుసలో ఉన్నాడు. పార్టీలోని ప్రతి ఒక్కరు చద్దా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు.

AAP MPs: సీఎం జైల్లో.. పార్టీ నేతలు విదేశాల్లో.. ఆప్ ఎంపీల తీరుపై సొంతపార్టీ నేతల విమర్శ

AAP MPs :అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టి ఊరు పేరు లేని వారికి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు… రాజ్యసభ సీట్లు అప్పగించారు. అయితే కష్ట కాలంలో వెన్నంటి ఉండాల్సిన సమయంలో తన పార్టీ సహచరులే ఇప్పడు ముఖం చాటేస్తున్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆమ్‌ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా మొదటివరుసలో ఉన్నాడు. పార్టీలోని ప్రతి ఒక్కరు చద్దా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా మంగళవారం నాడు ఆమ్‌ ఆద్మీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ రాఘవ చద్దా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. తమ ఎంపీ చద్దా కంటి సర్జరీకి లండన్‌ వెళ్లారు. రెండు నెలల నుంచి అక్కడే కంటి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. బహుశా ఒక కన్నుపోయే పరిస్థితి ఉందని తనకు చెప్పారని భరద్వాజ్‌ ఒకింత అసహనంతోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

సీఎంను కలవడానికి ముఖం చాటేస్తున్నారు..(AAP MPs)

ఎన్నికల సమయంలో దీర్ఘకాలం పాటు చద్దా ప్రచారానికి దూరంగా ఉండటానికి గల కారణాలు ఏమిటని మీడియా భరద్వాజను ప్రశ్నించింది. కంటి చికిత్స కోసం ఆయన లండన్‌ వెళ్లారు. ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. అయితే రాఘవ్‌ చద్దా మార్చి మొదటి వారంలో బ్రిటన్‌లో కాలుమోపారు. అప్పటి నుంచి పలు వివాదాలు ఆయన చుట్టుముట్టాయి. బ్రిటిష్‌ లేబర్‌ ఎంపీ ప్రీత్‌ కె గిల్‌తో చద్దా భేటీ అయ్యారు. ప్రత్యేక ఖలిస్తాన్‌ ఉద్యమానికి ఆమె బ్రిటన్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె ఇండియాకు వ్యతిరేకంగా విషం కక్కుతుంటారు.
సుదీర్ఘకాలం పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా విదేశాల్లో నెలల పాటు ఉండటంపట్ల ప్రతిపక్ష పార్టీలు కూడా ఆప్‌ పార్టీని నిలదీస్తున్నాయి. ఆప్‌ పార్టీకి చెందిన రాఘవ చద్దాతో పాటు స్వాతి మలివాల్‌లు విదేశాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక స్వాతి మలివాలి అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆప్‌ పార్టీలో పరిస్థితులు సరిగా లేవు. ఒక పక్క ఆప్‌ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు అయ్యి జైల్లో ఉన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ప్రముఖ నాయకులు లేకుండా పోయారు. ఇక బీజేపీ ఇదే అదునుగా తీసుకొని జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మంత్రులు దూరంగా జరుగుతున్నారని పేర్కొంది. తాజాగా కేజ్రీవాల్‌ రిమాండ్‌ పొడిగించిన తర్వాత నుంచి ఆయనకు పార్టీ నుంచి మద్దతు క్రమంగా తగ్గిపోతోంది. కేవలం అతిషి, సౌరభ్‌ భరద్వాజలు మాత్రమే తరచూ జైలుకువెళ్లి కేజ్రీవాల్‌ను కలిసి వస్తున్నారు. వీరిద్దరు తప్ప మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం కేజ్రీవాల్‌ను కలవడానికి ముఖం చాటేస్తున్నారని బీజేపీ ఐటి సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయా బీజేపీ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే రాఘవ్‌ చద్దా బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు లండన్‌ వెళ్లారు. అయితే ఆమె మాత్రం ఢిల్లీ తిరిగి వచ్చారు. భర్త కంటికి శస్ర్త చికిత్స చేసుకొని ఇబ్బందులు పడుతుంటే ఆమె మాత్రం భర్తను వదిలి ఇండియా రావడం పట్ల సోషల్‌ మీడియాలో పరిణితిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీని గురించి పరిణితి ఏమీ చెబుతారో వేచి చూడాల్సిందే.