Last Updated:

జీవీఎల్ నరసింహారావు : వైసీపీ, టీడీపీ కాపులను మోసం చేస్తున్నాయి : జీవీఎల్

జీవీఎల్ నరసింహారావు : వైసీపీ, టీడీపీ కాపులను మోసం చేస్తున్నాయి : జీవీఎల్

Gvl Narasimharao : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రిజర్వేషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీలో కాపు రిజర్వేషన్లు గురించి తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో గత తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టం చేసిన విషయం తెలిసిందే. కాపులు, బీసీల రిజర్వేషన్లపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు జీవీఎల్.నరసింహరావు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు జీవీఎల్ ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాపుల రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇస్తూ… కాపులకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపింది.

దీంతో పాటు బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం వివరించింది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర జాబితాకు సంబంధించినది అని… 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చేసిన చట్టం చట్టబద్ధమైనదే అని తెలిపింది. భారత రాజ్యాంగ 103వ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని తెలిపింది. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని సూచించింది.

కాగా ఈ మేరకు ప్రైమ్ 9 న్యూస్ నిర్వహించిన డిబేట్ లో జీవీఎల్ మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ కాపులను దశాబ్దాలుగా మోసం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీసీ కింద రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరమా అని ప్రశ్నించాను. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదని పార్లమెంటు సాక్షిగా సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీ ప్రభుత్వం అనాలోచిత చర్య వల్లే కాపు రిజర్వేషన్ అలస్యమైందని చెప్పారు. ఇక వైసీపీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్స్ విషయంలో కాపులకు అన్యాయం చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్స్ కల్పించుకునే అధికారాలు ఉన్నాయని.. ఇప్పటికైనా సంబంధిత చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా పార్లమెంట్ లో తాను అడిగిన ప్రశ్నల గురించి మరోసారి పూర్తి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం జీవీఎల్ చేసినన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ఇవి కూడా చదవండి: