Last Updated:

Bengal Coal Smuggling Scam: బెంగాల్ బొగ్గు అక్రమరవాణా కేసు..కోల్‌కతా విమానాశ్రయంలో రుజిరా బెనర్జీని అడ్డుకున్న అధికారులు

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  అడ్డుకున్నారు. బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ స్కామ్‌కు సంబంధించి ఆమెను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

Bengal Coal Smuggling Scam: బెంగాల్ బొగ్గు అక్రమరవాణా కేసు..కోల్‌కతా విమానాశ్రయంలో రుజిరా బెనర్జీని అడ్డుకున్న అధికారులు

Bengal Coal Smuggling Scam: తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  అడ్డుకున్నారు. బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ స్కామ్‌కు సంబంధించి ఆమెను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

బోర్డింగ్ నిరాకరణ..(Bengal Coal Smuggling Scam)

తన ఇద్దరు పిల్లలతో కలిసి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్న రుజీరాను ఉదయం 7 గంటలకు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు.రుజిరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు పంపింది, రెండు రోజుల తర్వాత విచారణకు పిలిచింది. దుబాయ్‌కి వెళ్లేందుకు ఈరోజు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆమెను ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అడ్డుకుని బోర్డింగ్ నిరాకరించింది.రుజిరాకు వ్యతిరేకంగా జారీ చేయబడిన యాక్టివ్ లుక్-అవుట్-సర్క్యులర్ ఆధారంగా ఆమెను నిలిపివేసినట్లు సమాచారం.

నిందితుల నుంచి నిధుల స్వీకరణ..

లీప్స్ అండ్ బౌండ్ ప్రయివేట్ లిమిటెడ్ మరియు లీప్స్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ LLP అనే రెండు కంపెనీలు అభిషేక్ బెనర్జీ మరియు అతని కుటుంబంతో అనుసంధానించబడి ఉన్నాయని ఈడీ పేర్కొంది. ఈ సంస్థలు, బొగ్గు అక్రమ రవాణా కేసులో విచారణ జరుపుతున్న నిందితుల ద్వారా నిర్మాణ సంస్థ నుంచి రూ.4.37 కోట్లనిధులను పొందినట్లు ఈడీ పేర్కొంది. అభిషేక్ బెనర్జీ తండ్రి, అమిత్ బెనర్జీ, లీప్స్ అండ్ బౌండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరు. అతని భార్య రుజిరా బెనర్జీ అతని తండ్రితో పాటు లీప్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్‌కి డైరెక్టర్.

అయితే రుజిరా బెనర్జీ కొన్ని రోజుల క్రితమే ఆమె తన ప్రయాణ ప్రణాళిక వివరాలు, టిక్కెట్ల కాపీని ఈడీకి అందించి తెలియజేసినట్లు ఆమె లాయర్ తెలిపారు.రుజిరా బెనర్జీ జూన్ 5 నుండి జూన్ 13 వరకు తన పిల్లలతో కలిసి దుబియాలో తన రాబోయే పర్యటన గురించి ఇమెయిల్ ద్వారా ఈడీ కి తెలియజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈడీ నుండి ఎలాంటి స్పందన లేదని ఆమె లాయర్ తెలిపారు.