Odisha Train Track Resume: బాలాసోర్ రైలు ప్రమాదస్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పూర్తి.. రైళ్లకు రూట్ క్లియర్
ఒడిసా బాలాసోర్ ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది ఇండియన్ రైల్వే సంస్థ. ఆ రూట్లో యథావిధిగా రైళ్ల రాకపోకలు జరిపేందుకు రూట్ క్లియర్ చేసింది.

Odisha Train Track Resume: దేశంలో అత్యంత ట్రాజెడీ ఘటనగా ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ దగ్గర జరిగిన రైలుప్రమాదం.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఈ భయానక ఘోర ప్రమాద ఘటనలో దాదాపు 300 మంది మరణించగా 1,175 మందికిపైగా గాయడ్డారు. కాగా ప్రమాదం జరిగి ఆ ప్రాంతమంతా మరణ ఆర్తనాదాలు హాహాకారాలతో మారుమోగింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పాడాలంటే అనుకున్నంత ఈజీ కాదు. కానీ ఆ పరిస్థితులనంతా నార్మల్ చేసేందుకు కేవలం ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది ఇండియన్ రైల్వే సంస్థ. ఆ రూట్లో యథావిధిగా రైళ్ల రాకపోకలు జరిపేందుకు రూట్ క్లియర్ చేసింది. పునరుద్ధరణ పూర్తయిన తర్వాత ఫస్ట్ లైన్ మీద తొలుత గూడ్స్ రైలు నడిచింది. ఆ తర్వాత మరికొన్ని రైళ్లను ట్రైల్ రన్ చేశారు. ఇంక రెండో లైన్‌కు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వచ్చేసింది. దానితో యథావిధిగా రైళ్లు మరల రాకపోకలు జరిపేందుకు ఆ రూట్ క్లియర్ అయ్యింది.
రైల్వే మంత్రి చొరవతోనే పునరుద్ధరణ వేగవంతం(Odisha Train Track Resume)
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నా వాటికి ఏ మాత్రం బెదరకుండా సహాయకచర్యల్లో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పరుగుపరుగున రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలికి అప్పటి నుంచి ఇప్పటివరకూ అక్కడే ఉంటూ దగ్గరుండి సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ అధికారులకు అండగా ఉండడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇంతటి ఘోర ప్రమాదం తర్వాత.. కేవలం 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ జరపడం గ్రేట్ అంటున్నారు. ఓ వైపు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తూనే.. ఇంకో వైపు సహాయక చర్యలు ముమ్మరంగా జరిగేలా అధికారుల్ని పరిగెత్తించారు. ప్రమాదానికి గురైన ట్రాక్ మరమ్మత్తులు, ట్రాక్ పునరుద్ధరణ పనులను సైతం వేగం పుంజుకునేలా చూశారు రైల్వే మంత్రి అశ్విని. ఇప్పుడు బాలాసోర్‌లో సాధారణ పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
- Manchu Vishnu Vs Manchu Manoj : ఇన్నాళ్ళకు బయటపడ్డ మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు..
- Pawan Kalyan Fan : చివరిసారి పవన్ ని చూడడం కోసం దిగ్విజయ సభకు వచ్చిన క్యాన్సర్ తో పోరాడుతున్న కుర్రాడు..