Home / తప్పక చదవాలి
మెగాస్టార్ చిరంజీవిని మరో అరుదైన అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని చిరు కౌవసం చేసుకున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని పేర్కొన్నారు.
హైదరాబాద్లో నిర్వహించిన వైఎన్ఎం కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాల నుంచి ఆయన వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.
విశాఖ ప్రైవేటీకరణపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. దేశం, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు బలంగా ఉండాలని తద్వారా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను తిప్పి కొట్టవచ్చని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం జరిగే ఉద్యమంలో ఒకొక్కరు కాకుండా కుటుంబ సమేతంగా లేదా మూకుమ్మడిగా వందలు వేలాది మంది తరలిరావడం ద్వారానే మన ఉక్కుపరిశ్రమను మనం కాపాడుకోగలమని ఆయన తెలిపారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. నేడు తను ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది.
సమీప బంధువులు లేదా తెలిసినవాళ్లకు పెండ్లికి పిలవడం చూస్తుంటాం. కానీ ఆ యువ జంట మాత్రం తమ దేశాన్ని తమను ఎంతో సుఖసంతోషాలతో ఉండేలా చూస్తూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు పెండ్లి పత్రిక పంపి వివాహానికి ఆహ్వానించారు.
ట్విట్టర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నూతన అధినేత ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు.
హైదరాబాద్ సిటీలో ప్రజలకు అలర్ట్. రూల్స్ పాటించకపోతే జేబుకు చిల్లు పడక తప్పదు. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు.
మీరు రూ.50 వేలకు పైబడిన చేస్తున్న ఆర్థిక లావాదేవీలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే. బ్యాంకులో ఖాతా తెరవడం మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కావడం లేదా అయితే ఇప్పుడే ఆధార్ తో పాన్ ను రీ యాక్టివేట్ చేసుకోండి.
వారిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలుగన్నారు. కానీ వారి జీవితాలతో విధి వింత గేమ్ ఆడింది. అనారోగ్యం బారినపడి ప్రియురాలు మృతి చెందింది. ప్రేయసి మరణవార్త విని తట్టుకోలేకపోయాడు. తనతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా.. ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకుని మృతదేహానికి తాళి కట్టి ఇకపై ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు.