Last Updated:

Visakha kidnap: విశాఖ ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

విశాఖపట్నంలో ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, ఆయన కుమారుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

Visakha kidnap: విశాఖ ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

Visakha kidnap:  విశాఖపట్నంలో ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, ఆయన కుమారుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

ముగ్గురిని కిడ్నాప్ చేసి రూ.50 కోట్లు డిమాండ్..(Visakha kidnap)

రుషికొండలోని ఎంపీపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ కుమారుడు, భార్యను బుధవారం అపహరించారు. వీరిని విడుదల చేయడానికి తమకు రూ. 50 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు పదిహేడు బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కేసును ఛేదించారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్‌గా పోలీసులు గుర్తించారు.

ముగ్గురిని విడిపించడంతో పాటు ప్రధాన నిందితుడు హేమంత్‌తో సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఎంపీ తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని తెలిపారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులతో హేమంత్ తరచూ గొడవపడేవాడు. ఈ ఏడాది కూడా అతనిపై ఇలాంటి కేసులు ఉన్నాయి. అందుకే ఈ కిడ్నాప్ ఘటన జరిగినప్పుడు ఇందులో హేమంత్ పాత్ర ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవడంతో ఈ కేసును త్వరగా ఛేదించినట్లు తెలుస్తోంది.