Home / తెలంగాణ
గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక హైదరాబాద్ లోని అశోక్‌నగర్‌లో గల ఒక హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు. అయితే నవంబరు 2,3 తేదీల్లో
అసలు ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక సంచికను విడుదల చేశారు. వెంకయ్య నాయుడుతో పాటు ఈ కార్యక్రమంలో
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. మరి ముఖ్యంగా యువత వీటికి ఎక్కువగా అలవాటు పడుతూ పెడద్రోవ పడుతున్నారు. ఇక ఇదే అదనుగా నేరగాళ్లు తమ నేరాలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో సహా చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గాంధీ సిస్టమ్ కాదని.. బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాడికి, జెండా మోసిన వాడికే ఏ స్కీమ్ అయినా దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా ఆయన ఉన్నతాధికారులను వాడు, వీడు అంటూ సంబోధించడం గమనార్హం.
కాంగ్రెస్‌లో విలీన ప్రక్రియ బెడిసి కొట్టడంతో వైఎస్ షర్మిల రూటు మార్చారు. తన సొంత పార్టీ వైఎస్ఆర్టిపి తరపునే తెలంగాణ ఎన్నికల్లో తలపడాలని వైఎస్ షర్మిల డిసైడయ్యారు. గురువారం నిర్వహించిన వైఎస్ఆర్టిపి కార్యవర్గ సమావేశంలో ఎన్నికల కార్యచరణపై నేతలు, క్యాడర్‌తో షర్మిల చర్చించారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల ఓ హోటల్ గదిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బయటికొచ్చింది. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి లోని కామరాజ నగర్ నివాసి..
తన కొడుకుని మిస్సవుతున్నానంటూ మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.. అని ప్రశ్నించారు. కొడుకుతో కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా.. అని అడిగారు.
ఆర్థరైటీస్ కారణంగా యువకులలో వైకల్యం ఏర్పడుతుందని కామినేని హాస్పిటల్ సీనియర్ జాయింట్ రీప్లెస్ మెంట్ స్పెషలిస్ట్ డా. బెజవాడ పాపారావు అన్నారు. ఈ వ్యాధి సోకిన పక్షంలో చికిత్స ప్రారంభించి వ్యాధి ముదిరి వ్యక్తి కదలిక క్రమక్రమంగా తగ్గిపోతాయని అన్నారు. అలాంటి వారిలో రోజువారీ జీవితం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు.