Home / తెలంగాణ
Kavitha urges more backward reservations in caste survey in report to BC panel: బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్, కులగణనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వెంకటేశ్వరరావులను కలిసి కవిత వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి […]
Kaleshwaram Commission Investigation Started From Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్లీ తన విచారణను కొనసాగించనుంది. పదిరోజుల పాటు సాగనున్న ఈ బహిరంగ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్ 52 మందిని విచారించటంతో బాటు తదుపరి విచారణకు నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే […]
Prajapalana Celebrations Review by CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం దీనిపై తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన మేలు ఏమిటనేది వివరించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు సూచించారు. ఈ ఉత్సవాలలో అన్ని […]
RSS Chief Mohan Bhagwat Speech in Lokmanthan Bhgyanagar At Hyderabad: భిన్నత్వంలోనే ఏకత్వాన్ని దర్శించటం భారతీయ సంస్కృతి గొప్పదనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో గత 4 రోజులుగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమపు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, గజేంద్ర షెకావత్ తదితరులు హాజరైన ఈ […]
Hyderabad in Danger Zone With the High Polution:హైదరాబాద్ నగరంలో వాయుకాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ రాజధానిలోని దుస్థితే ఇక్కడా ఎదురుకాక తప్పదని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా, ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి, తగిన నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే రాజధాని జనావాసానికి పనికి రాకుండా పోతుందని వారు వివరిస్తున్నారు. 300 దాటిన ఏక్యూఐ హైదరాబాద్ నగరంలో ఆదివారం గాలి నాణ్యత ఒక్కసారిగా తగ్గిందని, ఎయిర్ క్వాలిటీ […]
Indiramma Housing Committees: తెలంగాణలో ఇళ్లులేని పేదలందరికీ ఇందరిమ్మ పథకం కింద కట్టిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీనిచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఖాళీ జాగాఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని చెప్పింది. ఖాళీ స్థలం లేనివారికి జాగాతో పాటుగా రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను […]
Farmer Couple Attempt Suicide in Suryapet: క్వింటాలుకు ఏడున్నర కిలోల తరుగు కోతకు రైతు అంగీకరించలేదన్న కారణంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతగా లేదంటూ రైస్ మిల్లర్ నిర్వాహకులు తిప్పి పంపారు. దీంతో నిరసిస్తూ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చౌళ్లతండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యాజమాని పరిశీలించి […]
Police Notices To BRS MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ వివాదంలో ఉండే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఓ విషయంపై పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 9వ తేదీన పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హుజురాబాద్ చౌరస్తాలో దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా చేసేందుకు కౌశిక్ రెడ్డి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని […]
CM Revanth Reddy’s order to hold an Farmers Awareness Conference in mahaboobnagar: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్లో ఈ నెల 30న జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా నిర్వహించాలని సూచించారు. శనివారం సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావుతో కలిసి వ్యవసాయ శాఖపై సమీక్ష […]
MLC Kavitha Fires on Congress Government: గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల్లో ఇప్పటి వరకు […]