MLA Raja Singh Arrest: నాంపల్లి కోర్టుకు రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. రెండురోజులకిందట రాజాసింగ్ అరెస్టు సందర్భంగా 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ రాజాసింగ్ తరపు లాయర్ అభ్యంతరం

Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. రెండురోజులకిందట రాజాసింగ్ అరెస్టు సందర్భంగా 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ రాజాసింగ్ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రిమాండ్ రిక్వెస్టును కోర్టు తోసిపుచ్చింది. నాంపల్లి కోర్టు ఆదేశాలు అందిన తర్వాత ఇవాళ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజాసింగ్ ఇంటికి చేరుకుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.
తన అరెస్టుకు కొద్దిసేపటి ముందు రాజాసింగ్ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎంల పై విరుచుపడ్డ రాజాసింగ్. తాను అన్నింటికీ సిద్ధపడి ఉన్నానని, పాతబస్తీలో మత ఘర్షణలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తను జైల్లో పెట్టి నగర బహిష్కరణ చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.