Last Updated:

Minister Harish Rao: ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దు.. హరీష్ రావు

ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దని మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 3 కోట్ల 77లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు.

Minister Harish Rao: ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దు.. హరీష్ రావు

Siddipet: ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దని మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 3 కోట్ల 77లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, జప్తినాచారం గ్రామంలో 1 కోటి 57 లక్ష రూపాయలతో నిర్మించిన 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లనుమంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తన్నామన్నారు. ఏడాదికి రెండు సార్లు వరి పంట సాగు అవుతుంది. ప్రభుత్వ అంచనాలకు మించి వరి సాగు జరిగింది. గతంలో ఇక్కడి నుండిఉపాధి కోసం వలస వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలో వలస కూలీలు వచ్చి జీవనోపాధి పొందుతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలిత ప్రాంతంలో అమలవు తున్నాయా, అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో అమలైతున్న ఉచిత సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బిజెపి వాళ్లు అనడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ రోజు దేశానికి అన్నము పెట్టె స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందని అన్నారు. తాగడానికి గుక్కడు నీళ్ళు లేక కష్టపడ్డా సిద్దిపేట జిల్లా ప్రజలకు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగు సాగునీరు సరఫరా జరుగుతోందన్నారు.

కొంతమంది నేతలు ప్రాజెక్టుల నిర్మాణంను అడ్డుకున్నారని ఆరోపించారు. కాలేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణాల పై ప్రతిపక్షాలు ఇకనైనా గ్లోబల్ విమర్శలు మానుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. ఒకనాడు ట్యాంకర్లతో చెరువులు నింపుకున్న రోజులు ఉండేవని, కానీ నేడు రాష్ట్రంలో నిండుకుండలా నిండుకున్న చెరువులు ఉన్నాయని అన్నారు. ప్రజలు ఇవి గమనించాలని హరీష్ రావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: