Last Updated:

Bathukamma Celebrations: 25 నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలు

తెలంగాణ పండుగల్లో ప్రజలు ఆరాధించుకొనే పండుగల్లో బతుకమ్మ ఉత్సవాలు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా బతుకమ్మ పండుగను చేపడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తుంటుంది

Bathukamma Celebrations: 25 నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలు

Hyderabad: తెలంగాణ పండుగల్లో ప్రజలు ఆరాధించుకొనే పండుగల్లో బతుకమ్మ ఉత్సవాలు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా బతుకమ్మ పండుగను చేపడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో ఈ నెల 25 నుండి 9రోజుల పాటు బతుకమ్మ పండుగను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బీఆర్కే భవనంలో బతుకమ్మ ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్ సోమేష్ కుమార్, డీజిపీ మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు. అక్టోబర్ 3న ట్యాంకు బండ దగ్గర చేపట్టనున్న బతుకమ్మ ఉత్సవాలపై చర్చించారు. 9రోజుల పాటు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగను ప్రజలు ఆరాధిస్తుంటారు. ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే ప్రత్యేక వేడుకగా భావిస్తూ బంధాలను, అనుబంధాలను గుర్తు చేసుకొంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగే బతుకమ్మ పండుగగా జరుపుకొంటారు. పండుగలో ప్రత్యేక ఆకర్షణగా పలు పుష్పాలు కనువిందు చేస్తాయి. ప్రకృతిని పూజించే పండుగలో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ బతుకమ్మ పండుగను వాడ వాడలా చేపడుతూ భగవంతునిపై ఉన్న భక్తిని చాటి చెపుతుంటారు.

ఇవి కూడా చదవండి: