Home / ప్రాంతీయం
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబకు ఊహించని పరిణామం ఎదురైయింది. చంద్రబాబు ముందే టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు ఎంపీ కేశినేని నాని నిరాకరించారు. బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ బతిమాలిన లెక్కచేయలేదు. చేతికి ఇచ్చిన బొకేను చంద్రబాబు ముందే తోసేశారు.
ఆంధ్రప్రదేశ్ లో 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అందుబాటులోకి తెస్తోంది. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం 8 వేలకుపైగా పోస్టులను అప్‌గ్రేడ్
సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈ రోజు సాయంత్రం జగన్ హస్తినకు బయల్దేరనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరి ఆముదాలవలసకు చేరుకుంటారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరు అవుతారు. అనంతరం సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్
నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రల నుంచే కాకుండా, తమిళ నాడు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. సూళూరు పేట నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించనున్న SSLV D-1 శాటిలైట్ విజయవంతం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరొక వికెట్ పడింది. పార్టీకి కీలక నేత దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి (Vijayareddy) చేరికపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో ఉన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ గురకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. సాయంత్రం స్నాక్స్ తిన్న తరువాత 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో 14మంది విద్యార్థుల
రాయలసీమ జిల్లాలను వానలు వదలడం లేదు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జోరు వానతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ మండలం తెర్నేకల్, కుంకునూరులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై తానేమీ స్పందించబోనని ఆయన సోదరుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ఈడీ సీజ్ చేయడంపై ఢిల్లీలో ఎంపీలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎంపీ మాధవ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ వీడియో కాల్ లో ఉంది. ఆ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎంపీ తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.