Home / ప్రాంతీయం
హిందూపురం వైసీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం నిర్వహించారు. వీడియో కాల్ వ్యవహారంపై ఎంపీ మాధవ్ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఈనెల 4న కేసు నమోదు
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49. 50 అడుగులకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కొమటిరెడ్డి బద్రర్స్ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎలాగైన మునుగోడును గెలుచుకోవాలని భావిస్తున్నారు.
మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల తర్వాత పండుగ జరుగుతుండటంతో దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. అందుకు తగినట్లుగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దీంతో దర్గా ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలపై విచారణ జరుగుతోందని రిపోర్టులు వచ్చాకే చర్యలుంటాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ వేధించినట్లు ఏ మహిళా ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదన్నారు సజ్జల
హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. తలసేమియా బాధిత బాలుడికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. రెండున్నరేళ్లుగా నల్లకుంటలోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో బాలుడికి రక్త మార్పిడి చేయిస్తున్నారు. బాలుడికి హెచ్ఐవీ పాజిటివ్ రావడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తం అయ్యారు.
బ్రిటన్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుందని లేఖలో వివరించారు. అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించుట
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు.