Last Updated:

Mudragada Padmanabham: అంబేద్కర్ పేరు పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి.. కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం లేఖ

కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుందని లేఖలో వివరించారు. అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించుట

Mudragada Padmanabham: అంబేద్కర్ పేరు పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి.. కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం లేఖ

Andhra Pradesh: కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అంబేద్కర్ ను యావత్తు ప్రపంచమే కొనియాడుతుందని లేఖలో వివరించారు. అటువంటి మహా వ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించుట న్యాయం లేదని చెప్పారు. అంబేద్కర్ పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు ముద్రగడ పద్మనాభం.

సమాజంలో అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. కాని మరలా వెనుకటి రోజులకు వెలుతున్నామో అన్నది ఆలోచించండి. మట్టిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారు పుట్టిన రాష్ట్రం కాదు యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచమే కొనియాడుతున్నారు. అటువంటి మహావ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించుకొనుట న్యాయంగా లేదండి. వీరి పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన ఎవ్వరూ కాదనలేని పరిస్థితి అని నా భావన. న్యాయతా అయితే జి.యమ్.సి బాలయోగి గారి పేరు పెట్టాలి. వారు లోక్సభ స్పీకర్ అయిన తరువాతనే మీ ప్రాంతం అభివృద్ధికి వారే కారణం అని చెప్పకతప్పదండి. ఎదో ఒక కారణంతో బాలయోగి గారి పేరును పరిగణనలోనికి తీసుకోలేదు.

ఉమ్మడి రాష్ట్రంలోనే కొందరి గౌరవ పెద్దల పేర్లు పెట్టడం, అలాగే విడిపోయిన తరువాత మన రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలకు గౌరవ పెద్దల పేర్లు పెట్టడం జరిగిందండి. వారి పేర్లు పెట్టినంతమాత్రాన ఆ జిల్లాలు ఆ పేరుగల వారి ఆస్తులుగా మారిపోవుకదాండి, అటువంటప్పుడు అంబేద్కర్ గారి పేరును పెట్టినదానికి అభ్యంతరం పెట్టడం న్యాయమంటారా, ఆలోచించండి. అటువంటి మహావ్యక్తి పేరు మన ప్రాంతంనకు పెట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలని నేను భావిస్తున్నానండి అంటూ ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: