Home / ప్రాంతీయం
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్పు పై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. తెదేపా నేతలతోపాటుగా పలు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో నిరసిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గంధరగోళం పరిస్ధితులు ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా పేరు మార్చడం పై భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటీని ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ వర్శిటీ పేరును ఇకపై వైఎస్ఆర్ వర్శిటీగా మారుస్తూ ఏపీ శాసనసభ ఆమోద ముద్ర వేసింది. మంత్రి విడదల రజనీ సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు.
ఎన్టీఆర్ పేరు పలకడం కూడ చంద్రబాబుకు ఇష్టం ఉండదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పై జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబునాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఆయన రాజీనామా చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖదేవాలయాల్లో ఆన్లైన్ సేవలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సీఎం జగన్ సూచనల మేరకు అన్ని దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలు విస్తరిస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి.. ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.
కోట్ల రూపాయల భూమిని సొంతం చేసుకొనేందుకే ధరణీ పోర్టల్ తెచ్చారని భాజాపా ఎమ్మెల్యే ఈటెల రాజేంధర్ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ధ్వజమెత్తారు
తెలంగాణ ప్రజలకు దక్షిణ మద్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, మధ్య ప్రదేశ్ ప్రాంతాలను కలుపుతూ 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది