Home / ప్రాంతీయం
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని గుర్తులను తొలగించేలా ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కుదిరితే అమరావతి రైతుల పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానన్నారు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం వేదికగా వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పేర్నినాని ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో 175 స్ధానాల్లోనూ జనసేన అభ్యర్థులను నిలబెడితే ప్యాకేజీ స్టార్ అనే మాటలను వెనక్కి తీసుకుంటామని పేర్ని నాని సవాల్ విసిరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.
పవన్ కల్యాణ్ మంచితనం, సహనం మాత్రమే ఇప్పటి వరకు చూశారు. ఇకపై యుద్ధమే, మీరు సిద్ధమా అంటూ జనసేన సైనికులను అడిగితే మార్మోగిన కరాళధ్వనుల నడుమ అభిమానులు ఓకే చేశారు.
నా కన్నతల్లిని, చిన్నారులను తిట్టడం ఏంటిరా మీ సంస్కరహీనానికి హద్దులేదా అంటూ వైసిపిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిట్టిపోశారు. తనకు భాష రాదనుకొంటే పొరపాటన్నారు. మంగళగిరి సభలో వైకాపా నేతల తీరును ఆయన ఎండగట్టారు.
మరొక్క సారి ప్యాకేజ్ స్టార్ అని నన్ను అంటే వైకాపా శ్రేణులను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. దవడ వాచిపోయేలా కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
మునుగోడు బైపోల్ సందర్భంగా రోజురోజుకు రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పైకి పథకాలు వాగ్ధానాలు అంటూనే మరోవైపు ప్రజలకు ఓటుకు నోటు ఆశచూపుతారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి.
ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సాంబశివరావు నివాసంతో పాటు, హైదరాబాద్, నెల్లూర్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఏపీలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా ఎంపీ భరత్ వర్గీయులు రెచ్చగొడుతూ వారిపై నీళ్ల బాటిళ్లను విసిరారు. దీంతో రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది.