Home / ప్రాంతీయం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నభారత్ జోడో యాత్ర మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది.
సీఎం జగన్ ఈనెల 27న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్‌లోని మూడో యూనిట్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, జగన్ అడ్డాలో కోలుమోపాడు. చంద్రబాబు తనయుడు, యువ నాయకుడు అయిన నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తున్న సంగతి తెలిసిన తెదేపా పార్టీ శ్రేణులు కడప విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నాయి. లోకేశ్‌కు జనం నీరాజనం పట్టారు.
అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. అయితే క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా, ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైజాగ్ వచ్చిన పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించాని సోము వీర్రాజు మండిపడ్డారు. పవన్ తో కలిసి సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ నియోజకవర్గం అధికార వైసీసీకి తల నొప్పిగా మారిందట. ముగ్గురు నేతలు సై అంటే సై అంటున్నారట.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో పేర్కొన్నారు
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు రూ. 250కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం నష్ట పరిహారం కింద చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు అనే విషయం కామన్ అయిపోయాయి.
అత్తగారు తిట్టినందుకు కాదు. తోటి కోడలు నవ్వినందుకు కుమిలిపోయిందట ఒక కోడలు. వైసీపీ నేతల పరిస్దితి అలానే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కలిసి తమ అధికార దర్పాన్ని ఉపయోగించి, చూపించిన విశాఖ గర్జన అట్టర్ ప్లాప్ గా నిలిచింది.