Home / ప్రాంతీయం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలవగా, తమ్ముడికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు సిత్రాంగ్ ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో తీరప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకొన్నారు. అశువులు బాసిన పోలీసులను స్మరించుకొంటూ చేపట్టిన కార్యక్రమాల్లో నేతలు, ప్రజలు, విద్యార్ధులు స్వచ్ఛందంగా పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాదు నగరంలో మరో మారు భారీగా హవాలా సొమ్ము పోలీసులకు పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తనిఖీల చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఈ నగదు పట్టుబడింది.
మేమే శాశ్వతం, మాదే రాజ్యం అనే ధోరణిలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు కొణిదెల నాగబాబు హెచ్చరించారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటిఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ భాజపా పై గురిపెట్టింది. భాజపాకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకొంటున్నారు. ఒకే రోజు భాజపాకు చెందిన స్వామి గౌడ్, దాసోజి శ్రవణ్ లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు.
రాజకీయ నాయకులు ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటెయ్యమంటారని ఇప్పటివరకు అందరూ వింటుంటారు. అయితే అది నేరుగా వినేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఓ ఆడియో తెలంగాణ కాంగ్రెస్ లో పెనుదుమారం లేపుతుంది.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడాలి. దారుణానికి పాల్పొడిన నిందుతులకు శిక్ష పడాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చోటుచేసుకొన్న కాళేశ్వరం ప్రాజక్టు అవినీతిపై ఫిర్యాదు చేసే క్రమంలో ఆమె ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు