Home / ప్రాంతీయం
మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, స్వామిగౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
మద్యం మత్తులో, మానసిక సమస్యలతో కొందరు యువకులు సైకోల్లా ప్రవర్తిస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. వృద్ధుడిపై దాడి చేసి ఓ సైకో వీరంగం సృష్టించడం తీవ్ర కలకలం రేపింది.
బిఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి' వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని, మాట్లాడటానికి కూడ ఏమీ లేదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి అన్నారు.
మత్తులో పడితే జీవితాలు నాశనమవుతాయని వింటూనే ఉంటాం. అయితే ఈకోవకు చెందిన ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంటపై గంజాయి బ్యాచ్ రెడ్డి పోయింది. ముత్తులో ఉన్న ఇద్దరు యువకులు ప్రేమికుడి ముందే ప్రియురాలిపై దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ముస్తాబాద్‌లో చోటుచేసుకుంది.
అమరావతి రైతులు తాము చేస్తున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. .పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా అమరావతి జేఏసీ ప్రకటించింది.
ఏడేళ్లకిందట ఏపీ రాజధానిగా అమరావతి కి ప్రధాని మోదీ శంకుస్దాపన చేస్తే పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది