Home / ప్రాంతీయం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్నానంపై జ్నానం, దుష్ట శక్తులపై దైవశక్తి, సాధించిన విజయాలకు ప్రతీకే దీపావళిగా ఆయన తెలిపారు.
విహార యాత్ర అతనిపాలిట మృత్యువుగా మారింది. స్నేహితులతో సరదా కాస్తా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకొనింది.
ఈ దినం ఉదయం విజయవాడ జింఖానా మైదానంలో చోటుచేసుకొన్న బాణసంచా దుకాణాల అగ్ని ప్రమాదంలో ఇరువురు చనిపోయిన సంగతి విధితమే. దీనిపై భాజపా నేత విష్ణు వర్ధన రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రమాదకర వ్యాపారాలకు నగరంలోని కీలక ప్రాంతంలో ఎలా అనుమతి ఇస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాలెక్క ఇక్కడే పాగా వేసిండ్రు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కులవృత్తులను బలోపేతం చేస్తూ వస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలోని 13మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉందంటూ పోలీసు ఇంటిలిజెన్స్ నివేదికపై అధికార పార్టీ కుట్రలు తిప్పి కొట్టాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్రమత్తం చేశారు.
స్కూలుకు వెళ్లిన విద్యార్ధినులు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకొనింది.
రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డి పేటలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. యాది మరిచిండ్రా సార్.. డిగ్రీ కళాశాల ఇప్పిస్తా అన్నారు అంటూ ప్లెక్సీలపై రాతులు ఉన్నాయి. విద్యార్థుల ద్రోహి కేటీఆర్ మాకొద్ది ఈ పాలన అంటూ అందులో రాసి ఉంది.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సంతలో పశువులను కొనుగోలు చేసిన్నట్లుగా అధికార పార్టీ తెరాస ప్రజాప్రతినిధులను కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాతిపల్లి, ఊకొండి గ్రామంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం కేసిఆర్ పాలనపై ధ్వజమెత్తారు.