Last Updated:

ఎన్జీటీ: తెలంగాణ ప్రభుత్వానికి రూ. 900 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.900 కోట్ల భారీ జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.

ఎన్జీటీ: తెలంగాణ ప్రభుత్వానికి రూ. 900 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?

NGT: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.900 కోట్ల భారీ జరిమానా విధించింది. అనుమతులు లేకుండా పాలమూరు -రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు చేపట్టారంటూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనితో మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం పెనాల్జీ విధించింది ఎన్జీటీ.

పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన చెన్నై ఎన్జీటీ పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు రూ. 300 కోట్ల జరిమానాను విధించింది.అలాగే పర్యావరణ నష్టపరిహారానికి రూ. 528 కోట్లు జరిమానా వేసింది. అటు దిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి రూ. 92.8 కోట్ల జరిమానా వేసింది. ఈ జరిమానాలన్ని మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మెనేజ్ మెంట్ బోర్డు దగ్గర జమ చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.

ఇవి కూడా చదవండి: