Home / ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందుతుంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులుగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు వచ్చే నెల 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఈ క్రమంలోనే తెదేపా శ్రేణులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నచంద్రబాబుకు తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. నాలుగు వారాలపాటు చంద్రబాబుకు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదయింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.
విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504).. పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు. ముందుగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం రాత్రి విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504)..