Home / ఆంధ్రప్రదేశ్
Abhinay Tej Wedding: పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత దంపతుల కుమారుడు అభినయ్ తేజ్.. మాధవి, కోటపాటి సీతారామరావు కూతురు అక్షత వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుక డిసెంబర్ 25న బుధవారం రాత్రి 12.37 గంటలకు జరిగింది. ఈ మేరకు అభినయ్ తేజ్, అక్షత […]
PM Modi to Visit Ap on January 8: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. జనవరి 8వ తేదీన రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ మేరకు రూ.85వేల కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. కాగా, ఉత్తరాంధ్రపై కేంద్రం కరుణ చూపించింది. ఉత్తరాంధ్ర బహుముఖ అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ కీలక ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ మేరకు జనవరి 8 వ తేదీన 85వేల కోట్ల ప్రాజెక్టు పనులకు ప్రధాని […]
Former Minister Perni Nani’s Family Goes into Hiding: ఏపీలో మాజీ మంత్రి పేర్ని నానితో పాటు అతని కుటుంబ సభ్యులు కనిపించడం లేదని అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. నిత్యం మీడియా ముందు నీతి వ్యాఖ్యలు మాట్లాడే పేర్ని నాని అడ్రస్ లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన గ్రామాన్ని […]
Heavy Rain Alert telugu states: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు నుంచి కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు సుమారు 30 నుంచి 40 […]
AP Fibernet 410 Employees Removed: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్లో కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. అలాగే ఉద్యోగులను నియమించిన వ్యక్తులను సైతం లీగల్ నోటీసులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ హయాంలో అర్హత లేకుండా ఉద్యోగులను నియామకం చేసినట్లు గుర్తించారు. ఫైబర్ నెట్లో నియమితులైన వారిలో కొంతమంది వైసీపీ […]
AP Deputy CM Pawan Kalyan Visit Gudavalluru Krishna: ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యత లోపిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలిన జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా శుక్ర, శనివారాల్లో మన్యంలో పర్యటించిన జనసేనాని, సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ […]
Earthquake Shakes Andhra Pradesh: ఏపీలో మళ్లీ భూంకపం సంభవించింది. ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వరుసగా మూడో రోజు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముండ్లమూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10.34 నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కొంతమంది ఏం జరుగుతుందో అర్ధం కాక ఇబ్బందులు పడ్డారు. అలాగే తాళ్లూరు మండంలో స్వల్పంగా భూమి కంపించింది. […]
Kadapa MLA Madhavi Reddy Vs Mayor Suresh Babu: కడప కార్పొరేషన్లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. సర్వసభ్య సమావేశం వేదికపై మేయర్‌కు మాత్రమే కుర్చీ వేసి ఎమ్మెల్యేకు వేయకపోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు ఎందుకు కుర్చీ వేయలేదని మాధవరెడ్డి ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేదికపైకి వెళ్లి మేయర్ సురేష్‌తో ఎమ్మెల్యే మాధవరెడ్డి వాగ్వాదానికి దిగారు. గత సమావేశంలో కూడా ఇదే అంశంపై మేయర్, ఎమ్మెల్యేల […]
Poisonous Gases At Parawada Pharma City: అనకాపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విషవాయువులు లీకయ్యాయి. రక్షిత డ్రగ్స్‌లో ఒక్కసారిగా విష వాయువు లీక్ కావడంతో కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో విషవాయువు పీల్చిన నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆ నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే హైడ్రోజన్ సల్ఫైడ్ లీకైనట్లు గుర్తించారు. […]
Pharmacy Student Delivers Baby Girl at social welfare Hostel in Guntur district: 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లో తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా, హాస్టల్ సిబ్బంది, […]