PM Modi: త్వరలోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. రూ.85వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం!
PM Modi to Visit Ap on January 8: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. జనవరి 8వ తేదీన రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ మేరకు రూ.85వేల కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.
కాగా, ఉత్తరాంధ్రపై కేంద్రం కరుణ చూపించింది. ఉత్తరాంధ్ర బహుముఖ అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ కీలక ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ మేరకు జనవరి 8 వ తేదీన 85వేల కోట్ల ప్రాజెక్టు పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో దశాబ్ధాలుగా మిగిలిపోయిన రైల్వే జోన్, పారిశ్రామిక ప్రగతికి దిక్సూచిగా నిలిచే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఉన్నాయి. ఇందులో రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రధానమైనవి.
అచ్చుతాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ ఏపీ జెన్‌కో భాగస్వామ్యంతో గ్రీన్ హైడ్రోజన్ హభ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నక్కలపల్లి సమీపంలో పారిశ్రామిక దిగ్గజ సంస్థ మిట్టల్ గ్రూప్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఈ ప్లాంట్ రెండు దశల్లో నిర్మితం కానుంది. దీంతో ఆ ప్రాంతాలు ముఖచిత్రాలు మారనున్నాయి.
మరోవైపు దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన రైల్వే జోన్ సహకారం కానుంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌గా కేంద్రం ప్రకటించింది. దాదాపు ఐదేళ్లు జోనల్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపులపై సందిగ్ధత నెలకొంది.
ముడసర్లోవ దగ్గర గత ప్రభుత్వం ప్రతిపాదించిన సుమారు 50 ఎకరాలపై ఉన్న సమస్యలను కూటమి సర్కార్ క్లియర్ చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. డబల్ ఇంజన్ సర్కార్ ఆలోచనలు అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు.