Home / ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈరోజు మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.
అధికార పార్టీ నేతల వరుస హత్యలు ఏపీలో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల ఏలూరులో వైసీపీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్య మరువకముందే అదే తరహాలో ప్రకాశం జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై ఓ వైసీపీ నేతను లారీతో ఢీకొట్టి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని చోటుచేసుకుంది.
ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పంకు రానున్నారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. వచ్చే ఎన్నికల పైన ఇప్పటికే ఫోకస్ చేసిన సీఎం జగన్ 175 సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.
ఏ భూకంపం వస్తేనే లేదా నేల కుంగితేనో సడెన్ గా భవనాలు కూలిపోతాయి. అయితే మరి వైయస్ఆర్ జిల్లాలో మాత్రం అకస్మాత్తుగా అర్థరాత్రి వేళ ఓ భవనం కుంగిపోయింది. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. మరి ఈ ప్రమాదం ఎందుకు ఎలా జరిగిందో ఓసారి చూసేద్దాం..
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అడుగుకు రూ. 100 ఫైన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనలో సీబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. కొంతకాలంగా స్ధబ్దుగా ఉన్న సీబిఐ విచారణ తిరిగి ఊపందుకొనింది.
హిందూపురం పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేస్తున్న రెవిన్యూ ఇన్స్ పెక్టర్ షఫీఉల్లా ఏసిబీ వలలో చిక్కారు. 15వేల లంచం తీసుకొంటూ ఏసిబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు పై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకరి పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం. వైఎస్ఆర్ స్థాయిని పెంచదని, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని చెప్పారు.
ఏపీ శాసనసభలో ఆన్ లైన్ పేరుతో తెల్లవారుజామున తీసుకొచ్చిన పేరు మార్పు జీవో రద్దు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు