Hindupuram Municipal Corporation: ఏసిబీ వలలో హిందూపురం పురపాలక సంఘం ఆర్ఐ
హిందూపురం పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేస్తున్న రెవిన్యూ ఇన్స్ పెక్టర్ షఫీఉల్లా ఏసిబీ వలలో చిక్కారు. 15వేల లంచం తీసుకొంటూ ఏసిబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు

Sri Satya Sai Dist: హిందూపురం పురపాలక సంఘ కార్యాలయంలో పని చేస్తున్న రెవిన్యూ ఇన్స్ పెక్టర్ షఫీ ఉల్లా ఏసిబీ వలలో చిక్కారు. 15వేల లంచం తీసుకొంటూ ఏసిబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. వివరాల మేరకు, హిందూపురం పట్టణంలోని మార్కండేయ వీధిలో నివాసముంటున్న ఓ ఇంటి యజమాని నిర్మాణానికి సంబంధించి ఆర్ఐ షఫీ ఉల్లాను సంప్రదించారు. అనుమతి ఇచ్చేందుకు 15వేలను డిమాండ్ చేశాడు. దీంతో యజమాని ఏసిబీని ఆశ్రయించాడు. టౌన్ ప్లానింగ్ విభాగంలొ లంచం తీసుకొంటుండగా ఏసిబీ అధికారులు ఆర్ఐ ని అదుపులోకి తీసుకొన్నారు.
పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటుగా మారింది. ఇంటి నిర్మాణంలో పెరిగిన కూలీలు, నిర్మాణ వస్తువులతో కుదేలౌతున్న సమయంలో చిన్న చిన్న ఇంటి నిర్మాణాలకు సైతం లంచం కావాలని అధికారులు పీడిస్తుండడంతో ఏసిబీని ఆశ్రయిస్తున్నారు.