Home / ఆంధ్రప్రదేశ్
మూడు రాజధానుల మంట ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా అస్త్రాలను తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ బాబాయి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తాజాగా మరోమారు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగితే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని పేర్కొన్నారు
విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. వివరాల మేరకు, నున్న ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఏడేళ్ల బాలిక పై అత్యాచారం చేశాడు.
ఏపీలో 15 రోజుల పాటు స్పిన్నింగ్ మిల్లులు మూసి వేస్తున్నట్లు టెక్స్ టైల్స్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు మీడియాతో పేర్కొన్నారు. పరిశ్రమను ఆర్ధిక మాంద్యం వెంటాడుతుందని ఆవేదన వెలిబుచ్చారు.
రాజధానిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. వికేంద్రీకరణ ఆలోచనపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేనికీ గర్జనలు అంటూ ట్విట్ చేశారు.
గత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఈ విషయంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందించారు. కాగా ఇంకా ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా ఈ మరోసారి ఈ విషయం మీద ఓ వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ను బీభత్సంగా తిట్టిపోసింది.
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా పునః ప్రారంభం కానున్నాయి.
తెలుగుదేశం పార్టీ జెండా ఎవరెస్ట్ పై రెపరెపలాడింది. అదెలా అనుకుంటున్నారా, ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 80 ఏళ్ల వృద్ధుడు అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే అక్కడి వరకూ వెళ్లి తాను ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశాడు. మరి ఆ విషయాలేంటో చూసేయ్యండి.
పంచాయతీ ప్రజలకు నమస్కారం. ఖాతాలో అర్థరూపాయి మాత్రమే ఉంది కనుక అభివృద్ధి పనులు చేయలేను కాబట్టి నేన్నేం అడగొద్దు ప్లీజ్ అంటూ ఓ సర్పంచ్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వైకాపా అసమ్మతి నేత దారుణ హత్యకు గురయ్యాడు. కళ్లల్లో కారం చల్లి 18 చోట్ల వేడకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు దుండగులు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంది