Home / ఆంధ్రప్రదేశ్
Bank Notice To Mla Sridhar Reddy: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్తులు వేలానికి సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీచేసింది.
Weather Alert: ఒకవైపు అల్పపీడనం, ఇంకోవైపు నైరుతి మేఘాలు, మరోవైపు ఉపరితల ఆవర్తనం.. ఈ మూడు కలిసి తెలుగు రాష్ట్రాలపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఎడతెరపిలేని జోరువానతో తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దయ్యాయి.
భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరిజిల్లాలో గోదావరి, శబరి నదులకి వచ్చిన వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు.
జగన్‌కు చెబుతున్నా.. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గురువారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్‌కు రెడీ.. జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు.
హైదరాబాద్ నగర శివార్లలోని బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలని పరిశీలించేందుకు వెళుతున్నకేంద్రమంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఓఆర్ఆర్పై తుక్కుగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడిరోడ్డుపై కిషన్ రెడ్డితోపాటు ఇతర బిజెపి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కిషన్ రెడ్డి తదితరులని అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయానికి తరలించారు.
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది.
ఏపీ రాజకీయాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య సంచలన విశ్లేషణ చేశారు. ఎన్‌డిఎ మిత్ర పక్షాల ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్‌ని పిలవడమంటే తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన చరిష్మాని ఉపయోగించడం ద్వారా లబ్ధి పొందాలనేదే ధ్యేయంగా కనిపిస్తోందని జోగయ్య అంచనా వేశారు.
మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో పవన్‌తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.
మనుష్యులు మనుష్యులుగా ప్రవర్తించడం మానేశారా అనే ప్రశ్న ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటీవల ఒక వ్యక్తిపై మరో వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మరిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. కాగా ఇప్పుడు అంతకన్నా అవమానీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. మొదట ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో సెటిల్ మెంట్ చేసేందుకు యత్నించగా.. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.