Last Updated:

Minister Botsa Sathyanarayana : మోగనున్న బడి గంట.. ఎప్పటి నుంచి ఓపెన్ అంటే ?

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వెల్లడించారు. ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ప్రభుత్వ పథకం జగనన్న విద్యా కానుక కిట్ లను విద్యార్థులకు అందిస్తారని మంత్రి తెలిపారు. దాదాపు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్ లు ఇస్తున్నట్లు వెల్లడించారు.

Minister Botsa Sathyanarayana : మోగనున్న బడి గంట.. ఎప్పటి నుంచి ఓపెన్ అంటే ?

Minister Botsa Sathyanarayana : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వెల్లడించారు. ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ప్రభుత్వ పథకం జగనన్న విద్యా కానుక కిట్ లను విద్యార్థులకు అందిస్తారని మంత్రి తెలిపారు. దాదాపు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్ లు ఇస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే పదో తరగతి, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం ఉంటుందన్నారు. జగనన్న విద్యా కానుక కోసం 1100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న నాలుగో విడత అమ్మఒడి నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు. గోరుముద్ద ద్వారా పౌష్ఠికాహార భోజనం అందిస్తున్నామన్నారు.