Last Updated:

హనీ ట్రాప్ : అందంగా లేనా అంటుంది.. రిప్లై ఇస్తే లక్షలు లాగేస్తుంది… ఇంస్టా బ్యూటీ హనీ ట్రాప్

హనీ ట్రాప్ : అందంగా లేనా అంటుంది.. రిప్లై ఇస్తే లక్షలు లాగేస్తుంది… ఇంస్టా బ్యూటీ హనీ ట్రాప్

Honey Trap : ప్రస్తుత కాలంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే కోరికతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘరానా మోసాలు చాలా వెలుగులోకి వచ్చాయి. కాగా తాజాగా కృష్ణా జిల్లాలో మరో ఘటన బయటపడింది. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి టిక్ టాక్, ఇన్ స్టా, ఫేస్  బుక్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే ఎవరైనా అబ్బాయిలు కామెంట్స్ పెడితే వారిని బురిడి కొట్టించేది. అందంగా లేనా అంటూ వారితో పులిహోర కలిపి చివరకు సర్వం దోచేసేది. ఈ కీలాడీ లేడీకి… ఆమె ప్రియుడు కూడా సహకారం అందించడంతో ఎందరో ఆమెకు బాధితులుగా మిగిలారు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

ఈ విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం బాగోలేదంటూ 8 నెలల్లో 31లక్షల 66వేలు వసూలు చేసింది. ఆమెది మోసమని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కాగా ఆ యువతి కృష్ణాజిల్లా చెందిన పరాస తనుశ్రీ గా గుర్తించారు.

తనుశ్రీ… ప్రేమ, పెళ్లి పేరుతో యువకులను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తుండేంది. ఆమె వీడియోల కింద కామెంట్లు పెట్టేవారికి తిరిగి పర్సనల్‌గా మెసేజ్‌లు పంపించేది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి డబ్బు వసూలు చేసేది. ఆమెకు సహకరిస్తున్న శ్రీకాంత్ ను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కూడా మోసపోగా చివరికి అతను ఇచ్చిన ఫిర్యాదుతో విషయం బయటపడింది. అయితే, వీరిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల్లోని చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: