Elephant Killed Couple : చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో దంపతులు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని గుడిపాల మండలం 190 రామాపురం హరిజనవాడలో ఏనుగు దంపతులను తొక్కి చంపిన ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఏనుగు దాడిలో మృతి చెందిన వారిని వెంకటేష్, సెల్విగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Elephant Killed Couple : చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని గుడిపాల మండలం 190 రామాపురం హరిజనవాడలో ఏనుగు దంపతులను తొక్కి చంపిన ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఏనుగు దాడిలో మృతి చెందిన వారిని వెంకటేష్, సెల్విగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ అనూహ్య ఘటనలో పోలీసులు తెలిపన వివరాల ప్రకారం..
గ్రామ శివారులోని పంట పొలాల పక్కన దంపతులు ఉండగా ఏనుగు వారిపై దాడి చేసి తొక్కి చంపింది. ఈ నేపథ్యంలో మరణించిన వారి వద్దకు వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. సమాచారం అందిన వెంటనే చిత్తూరు వెస్ట్ సీఐ రవిప్రకాష్ రెడ్డి, ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఏనుగును అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు సీకే పల్లికి చెందిన సుధాకర్ తోటలో ఏనుగు తిరుగుతుండటాన్ని గమనించి బసవాపల్లి ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు కార్తీక్ వెళ్లగా అతడిపై దాడి చేసి దంతాలతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
గతంలో కూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఏనుగుల దాడిలో పలువురు మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 12న కుప్పం మండలం చప్పానికుంటలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు. శివలింగప్ప, ఉషలుగా మృతులను గుర్తించారు. పంట పొలాల్లో పనిచేస్తున్న మహిళలపై దాడి చేయడంతో మరో ముగ్గురు కూడ గాయపడ్డారు. అటవీ శాఖ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.