Last Updated:

AP Government : ఏపీలో 14 వ తేదీ నుంచి మళ్ళీ తెరుచుకోనున్న స్కూళ్ళు.. కానీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటి పూట మాత్రమే బడి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని.. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు

AP Government : ఏపీలో 14 వ తేదీ నుంచి మళ్ళీ తెరుచుకోనున్న స్కూళ్ళు.. కానీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు

AP Government : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటి పూట మాత్రమే బడి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని.. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం రాగి జావ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, ఎండల తీవ్రత నేపథ్యంలో స్కూళ్ల పున:ప్రారంభాన్ని వాయిదా వేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం అందుతుంది. మరోవైపు విద్యార్థుల‌కు ఏపీ ప్రభుత్వం స్కూళ్లు ప్రారంభమైన రోజు నుంచే విద్యార్థులకు జగన్న విద్యా కానుకను అందించనున్నారు. ఈ పథకం కింద సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాం లతో పాటు బూట్లు, సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లీష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

కాగా ఈ ఏడాది జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు మూడు జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో క్లాత్ సరిపోలేదని ఫిర్యాదులు రావడంతో ఈసారి విద్యార్థులందరికీ ఇచ్చే క్లాంత్‌ను 23శాతం నుంచి 60శాతం వరకు అదనంగా అందిస్తున్నారు.