Taraka Ratna: ఫిల్మ్ ఛాంబర్ కు తారకరత్న పార్ధివ దేహం.. సాయంత్రం అంత్యక్రియలు
Taraka Ratna: నందమూరి తారకరత్న మరణవార్తను తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారకరత్న మృతి.. అభిమానులని, కుటుంబ సభ్యులను, సినీ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.
Taraka Ratna: నందమూరి తారకరత్న మరణవార్తను తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారకరత్న మృతి.. అభిమానులని, కుటుంబ సభ్యులను, సినీ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.
ఫిల్మ్ ఛాంబర్ కు తారకరత్న పార్ధివ దేహం.. (Taraka Ratna)
చిన్న వయసులోనే తారకరత్న మరణించడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకొచ్చారు. అన్నీ తానై ముందున్న బాలకృష్ణ.. ఫిల్మ్ ఛాంబర్ కి బయలుదేరాడు. బాలకృష్ణతో పాటు.. విజయసాయి రెడ్డి కూడా ఫిల్మ్ ఛాంబర్ కి వచ్చారు. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం సాయంత్రం వరకూ ఫిల్మ్ ఛాంబర్ లోనే ఉంచనున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక తారకరత్న పార్ధివ దేహం వద్ద ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, పిల్లలు విషణ్ణ వదనంతో కూర్చున్నారు.
నివాళులు అర్పించిన తండ్రి మోహన కృష్ణ..
ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న పార్ధివ దేహానికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు. కుమారుడి పార్ధివ దేహనికి తండ్రి మోహన కృష్ణ నివాళులు అర్పించారు. అతనితో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. తారకరత్నకు తల్లిదండ్రులు నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. 2012 లో తారకరత్న.. ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని తారకరత్న తల్లిదండ్రులు సహా నందమూరి కుటుంబం వ్యతిరేకించింది. నందమూరి కుటుంబం మెుత్తం.. ఆయన పెళ్లిని బహిష్కరించింది. స్నేహితుల సమక్షంలో అలేఖ్యను తారకరత్న వివాహమాడారు. ఆ తర్వాత కొంతకాలానికి తల్లిదండ్రులు మనసు మార్చుకుని వారిని దగ్గరకు తీశారు.
తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
తారకరత్న మృతితో.. ఆయన కుటుంబం ప్రస్తుతం ఒంటరైంది. తారకరత్నకు ముగ్గురు సంతానం కావడంతో.. వారి బాధ్యతలను బాలకృష్ణ తీసుకోనున్నారు. ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూసుకుంటానని తెలిపాడు. అలాగే.. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి కూడా కుటుంబ పరంగా.. అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చినట్లు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
ఎన్టీఆర్ పై అభిమానం.. ఆయన పేరు కలిసివచ్చేలా పిల్లలకు పేర్లు
తారకరత్నకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. అందుకు తగినట్లుగానే.. ఆయన పేరు వచ్చేలా తన పిల్లలకు పేర్లు పెట్టాడు తారకరత్న. మెుదటి పాపకు నిష్క అని పేరు పెట్టగా.. ఆ తర్వాతి బాబు పాపకి తనయ్ రాయ్, రేయా అని పేర్లు పెట్టాడు. వీరి పేర్లలోని మెుదటి అక్షరాలు ఎన్టీఆర్ అని చూపిస్తాయి.
నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఇక శనివారం నాడు ఆయన శివైక్యం చెందారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/