Technical Issue in SpiceJet: స్పైస్ జెట్ విమానంలో టెక్నికల్ ఇష్యూ.. శంషాబాద్ లో సేఫ్ ల్యాండింగ్
Technical Issue in SpiceJet landed in Shamshabad Airport: అహ్మాదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడుతున్నారు. నిత్యం ఏదో ఒక విమానంలో సాంకేతిక లోపాలు కనిపించడం, పలు కారణాలతో ఫ్లైట్ జర్నీలు అంటేనే జంకుతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానంలో సమస్యను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్ ఏటీసీ సెంటర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ అనుమతితో విమానాన్ని ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను ఇతర విమానాల్లో తిరుపతి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.