GSEC in Hyderabad: గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్.. ఇండియాలోనే తొలిసారిగా
CM Revanth Inaugurates Google Safety Engineering Center in Hyderabad: హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ప్రారంభమైంది. ఇండియాలో మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను గూగుల్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలోని గూగుల్ దివ్యశ్రీ భవన్ లో ఈ సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఈ సెంటర్ ను ప్రారంభించారు. కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ మల్లు రవి హాజరయ్యారు.
కాగా దేశంలోనే మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తరువాత గూగుల్ ఏర్పాటు చేసిన రెండో సేఫ్టీ సెంటర్ ఇదే. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గూగుల్ సెఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ లో ఇది ఐదవది కావడం గమనార్హం. జీఎస్ఈసీ ఓ అంతర్జాతీయ సంస్థ. అధునాతన భద్రతతో పాటు ఆన్ లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించనుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, అత్యాధునిక పరిశోధన, సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేస్తున్న నిపుణులు, పరిశోధనలకు ఇది ఓ వేదికగా ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. దీని వల్ల రాష్ట్రంలోని ఐటీ రంగంలో ఉన్న వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు.