RR vs LSG: తడబడిన లక్నో.. రాజస్థాన్ లక్ష్యం 155 పరుగులు
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు పాయింట్ల పట్టికలో ముందున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
RR vs LSG: లక్నో జట్టు బ్యాటింగ్ లో తడబడింది. 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 154 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ మినహా ఏ ఒక్కరు రాణించలేదు. కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశాడు.
రాజస్థాన్ బౌలర్లలో.. అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బౌల్డ్, హోల్డర్, శర్మ తలో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
RR vs LSG: తడబడిన లక్నో.. రాజస్థాన్ లక్ష్యం 155 పరుగులు
లక్నో జట్టు బ్యాటింగ్ లో తడబడింది. 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 154 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ మినహా ఏ ఒక్కరు రాణించలేదు. కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశాడు.
రాజస్థాన్ బౌలర్లలో.. అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బౌల్డ్, హోల్డర్, శర్మ తలో వికెట్ తీసుకున్నారు.
-
RR vs LSG: మూడో వికెట్ డౌన్.. దీపక్ హుడా క్యాచ్ ఔట్
లక్నో మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ లో హుడా క్యాచ్ ఔట్ అయ్యాడు. దీపక్ హుడా కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.
-
RR vs LSG: రెండో వికెట్ డౌన్.. బడోని క్లీన్ బౌల్డ్
లక్నో రెండో వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో బడోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
-
RR vs LSG: లక్నో తొలి వికెట్ డౌన్.. కేఎల్ రాహుల్ ఔట్
లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 39 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. హోల్డర్ బౌలింగ్ లో బట్లర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
RR vs LSG: 9 ఓవర్లో భారీ సిక్సర్.. 74 పరుగులు చేసిన లక్నో
9 ఓవర్లకు లక్నో 74 పరుగులు చేసింది. చివరి ఓవర్లో చాహాల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఓవర్లో రాహుల్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు.
-
RR vs LSG: ముగిసిన 8వ ఓవర్.. 56 పరుగులు చేసిన లక్నో
8 ఓవర్లు ముగిసే సరికి లక్నో 56 పరుగులు చేసింది.
-
RR vs LSG: ముగిసిన పవర్ ప్లే.. 37 పరుగులు చేసిన లక్నో
పవర్ ప్లే ముగిసే సరికి లక్నో 37 పరుగులు చేసింది.
-
RR vs LSG: నిప్పులు చెరిగే బౌంతులు వేస్తున్న బౌల్డ్
లక్నో మూడు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే చేసింది. బౌల్డ్ 2 ఓవర్లలో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
-
RR vs LSG: తొలి ఓవర్ మెయిడిన్..
బౌల్డ్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్ అయింది. బౌల్డ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేఎల్ రాహుల్ ఒక్క పరుగు కూడా చేయలేదు.
-
RR vs LSG: లక్నో బ్యాటింగ్.. క్రీజులోకి కేఎల్ రాహుల్, మేయర్స్
టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన లక్నో. ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, మేయర్స్. బౌల్డ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
-
RR vs LSG: రాజస్థాన్ బౌలింగ్.. జట్టు ఇదే
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, మురుగన్ అశ్విన్.
-
RR vs LSG: లక్నో బ్యాటింగ్.. జట్టు ఇదే
క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, జయదేవ్ ఉనాద్కత్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్