Last Updated:

Tiger Nageswararao : మాస్ మహరాజ్ రవితేజ “టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు” ట్రైలర్ రిలీజ్..

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో

Tiger Nageswararao : మాస్ మహరాజ్ రవితేజ “టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు” ట్రైలర్ రిలీజ్..

Tiger Nageswararao : మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతుతుంది. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కి  రెడీ అవుతుంది ఈ మూవీ.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా క్రమంలోనే ముందుగా ప్రకటించిన మేరకు ఆడియన్స్ కి మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది మూవీ టీం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.. ఇక ఈ ట్రైలర్ ని గమనిస్తే.. గుంటూరు రైల్వే స్టేషన్‌ వేలం పాట తో మొదలై వరుసగా యాక్షన్‌, అమ్మాయిలు, బంగారు అభరణాల దొంగతనం సీన్లతో రేసీగా సాగింది. ఇక కొట్టే ముందు, కొట్టేసే ముందు వార్నింగ్‌ ఇవ్వడం నాకు అలవాటు అని రవితేజ చెప్పే మాస డైలాగ్ అదిరిపోయింది.

ఇక హీరోయిన్‌ని ఉద్దేశించి కొలతలు బాగున్నాయి, కానీ మగజాతి మొత్తం కొలతలే చూస్తారు, కాకపోతే అనుభూతి, ఆరాధన అనే అర్థం లేని బూతులు మాట్లాడతారు` అంటూ రవితేజ చెప్పే బోల్డ్ డైలాగ్‌ షాకింగ్‌గా ఉంది. టైగర్‌ నాగేశ్వరావుకి, ప్రధాని పర్సనల్‌ సెక్యూరిటీకి ఏంటీ సంబంధం అనే ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. కాగా ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఈ సినిమా పై స్టూవర్టుపురంకి చెందిన ప్రజలు, ఎరుకల జాతి వారు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమని కించపరిచే విధంగా సినిమా తీస్తున్నారంటూ కోర్టుని ఆశ్రయించారు. ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు కూడా దిగారు. కోర్టు కూడా ఈ మూవీ యూనిట్ పై అసహనం వ్యక్తం చేసింది.