PM Modi: కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను విడిచిపెట్టిన ప్రధాని మోదీ
నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడిచిపెట్టారు. ఈ ఉదయం నమీబియా నుండి తీసుకొచ్చిన 8 చిరుతలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకువెళ్లాయి.

Madhya Pradesh: నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడిచిపెట్టారు. ఈ ఉదయం నమీబియా నుండి తీసుకొచ్చిన 8 చిరుతలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకువెళ్లాయి.
కునో నేషనల్ పార్క్‌లో ఈ చిరుతలను చూడడానికి ప్రజలు ఓపిక పట్టాలి. కొన్ని నెలలు వేచి ఉండాలి. ఈ చిరుతలు ఈ ప్రాంతానికి తెలియకుండానే అతిథులుగా వచ్చాయి. కునో నేషనల్ పార్క్‌ను తమ నివాసంగా మార్చుకోవడానికి ఈ చిరుతలకు కొన్ని నెలల సమయం ఇవ్వాలి అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్-ఖండాంతరంగా ఉన్న ప్రాజెక్ట్ చీతా కింద భారతదేశంలో భూమి పై అత్యంత వేగవంతమైన జంతువును పరిచయం చేస్తున్నారని ప్రధాన మంత్రి కార్యాలయంవిడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.