Home / తాజా వార్తలు
veekshanam Pre-release event: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వీక్షణం’. ఈ సినిమాను పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తుండగా.. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్బంగా డీఓపీ సాయిరామ్ మాట్లాడుతూ.. వీక్షణం సినిమాకు పని చేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. […]
Google Pixel 9 Pro: గూగుల్ ఇటీవల భారత్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్ రేపు (అక్టోబర్ 17) మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి రానుంది. ఇది 16GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది.ఈ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్లను తెలుసుకుందాం. కంపెనీ గూగుల్ పిక్సెల్ 9 ప్రోని రూ. […]
iPhone 16 Discount: మీరు iPhone 16ని కొనాలని చూస్తున్నారా? అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వదిలేయండి. విజయ్ సేల్స్ మీ కోసం ప్రత్యేక ఆఫర్‌ని ప్రకటించింది. దీని ద్వారా మీరు ఈ ఫోన్‌ని రూ. 75,000 కంటే తక్కువకు కొనచ్చు. ఐఫోన్ 16 ధర రూ. 79,900. అయితే ఇప్పుడు ఆఫర్‌పై రూ. 74,900కి దక్కించుకోవచ్చు. ఇది చాలా గొప్ప విషయం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అలాంటి ఆఫర్లను చూడలేరు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Tata Safest Cars: సేఫ్టీ రేటింగ్స్‌లో టాటా మోటర్స్ వాహనాల ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా Bharat NCAP టాటా మూడు కార్ల క్రాష్ టెస్ట్ రేటింగ్లను విడుదల చేసింది. ఈ జాబితాలో టాటా కర్వ్, కర్వ్ ఈవీ, నెక్సాన్ ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ టాప్ స్కోర్లను సాధించాయి. టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ఇవి పెద్దలు, పిల్లలకు పూర్తిగా సురక్షితం. ఇప్పటి వరకు దేశంలో NCAPలో క్రాష్ టెస్ట్ చేసిన అన్ని టాటా కార్లు […]
DA Hike: దీపావళికి ముందు ఛత్తీస్‌గఢ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి పెరిగింది. రాష్ట్ర ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కరువు భత్యం అందనుంది. రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడిన సీఎం సాయి.. ఈరోజు ఉదయం 11:30 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఉద్యోగులందరికీ ప్రస్తుతం […]
Viral Video: రోడ్డు దాటుతున్నప్పుడు చాలాసార్లు ప్రమాదాల బారిన పడి, ఒక్కోసారి ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందుకే రోడ్డు దాటేటపుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. కానీ ఆకాశం నుంచి ప్రమాదం వస్తే జాగ్రత్త కూడా పనికిరాకుండా పోతుంది. సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీధిలో నడుస్తూ ఓ మహిళ కనిపించింది. ఆ మహిళ మరో మహిళతో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీని తర్వాత ఆమె నెమ్మదిగా ముందుకు కదుళుతుంది. […]
Jio 84 Days Plan: మీరు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లు అయితే మీకో అదరిపోయే శుభవార్త ఉంది. ఎక్కువ రోజులు వాలిడిటీ అందించే రెండు రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్ల మధ్య దాదాపు రూ.90 వ్యత్యాసం ఉంది. కాల్స్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలను ఒకే విధంగా అందిస్తాయి. అలానే 84 రోజుల వాలిడిటీని అందిస్తాయి. రండి ఈ ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం. రిలయన్స్ జియో రూ.799 ప్లాన్ జియో రూ. 799 […]
TS News: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రిలీఫ్ నిరాకరించడంతో తెలంగాణకు చెందిన ఆల్ ఇండియా సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారులు మంగళవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్‌ను మూవ్ చేయాలని నిర్ణయించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు అధికారులు క్యాట్ తలుపులు తట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఐఎస్ అధికారులను డీఓపీటీ ఆదేశాలను పాటించి, ఏ రాష్ట్రాలకు అపాయింట్ చేశామో ఆ రాష్ట్రాలకు నివేదించాలని […]
Heavy Rains: వరుణుడు దక్షిణాది రాష్ట్రాలపై విరుచుకుపడుతున్నాడు. ప్రజలను భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు ప్రజలను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు కదులుతూ తీవ్ర తుపానుగా మారింది. చెన్నైకి దక్షిణంగా తీరం దాటే అవకాశం ఉందని అధికారలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో […]