Home / తాజా వార్తలు
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలపై విచారణ జరుగుతోందని రిపోర్టులు వచ్చాకే చర్యలుంటాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ వేధించినట్లు ఏ మహిళా ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదన్నారు సజ్జల
కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్ క్రీడలను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే.
యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఆసియా కప్ టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై ఈడీ సీరియస్ అయ్యింది. శివసేనకు చెందిన సామ్నా అనే పత్రికలో వారం వారం రోక్ తక్ అనే కాలాన్ని సంజయ్ రౌత్ రాస్తుంటారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నందున జైలు నుంచి వారం వారం కాలం రాసే అవకాశం లేదు. అయితే ఆదివారం సామ్నా పత్రికలో కూడా రౌత్ కాలం ప్రచురితమైంది.
గ్రేటర్ నోయిడాలో ఈ రోజు బుల్డోజర్లు యాక్షన్‌లోకి దిగాయి. బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన శ్రీకాంత్ త్యాగి అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇటీవలే త్యాగి నివసించే గ్రాండ్ ఒమాక్స్ సొసైటీకి చెందిన ఓ మహిళను దర్భాషలాడ్డంతో పాటు చేయిచేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ రోజుతో తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలనూ పంచుకున్నారు.
హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. తలసేమియా బాధిత బాలుడికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. రెండున్నరేళ్లుగా నల్లకుంటలోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో బాలుడికి రక్త మార్పిడి చేయిస్తున్నారు. బాలుడికి హెచ్ఐవీ పాజిటివ్ రావడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణ రంగం సిద్దం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ర్ట అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరుగనుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ లభించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని సింధు ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు.. రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది.
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మరియు వీ (గతంలో వోడాఫోన్-ఐడియా) వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు తమ 5G సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకురావడానికి సిద్దమవుతున్నారు..సెప్టెంబర్ 29 న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ 5G నెట్‌వర్క్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.